చంద్రబాబు …లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల ను ఖండిస్తున్నాం
1 min read
విజయవాడ , న్యూస్ నేడు: మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, పేర్ని నానీలు ముఖ్యమంత్రి చంద్రబాబు పై, మంత్రి లోకేష్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఖండిస్తూ జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో అంబటి, పేర్ని, జోగి ఫోటోలను దగ్ధం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారురాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామా ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంలో జైలు పాలు అవ్వక తప్పదని గ్రహించిన జగన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైసీపీలో ఉన్న బీసీలను, కాపులను రెచ్చగొట్టి చంద్రబాబు, లోకేష్ లపై బూతు పురాణం మొదలు పెట్టించాడని విమర్శించారు.చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, అడ్డుకోవాలని ఉద్దేశంతో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే జగన్ రెడ్డి ఆలోచనలతో అంబటి రాంబాబు, పేర్ని, జోగి రమేష్ లతో విచ్చలవిడిగా మాకు ఆరాధ్య దైవమైన చంద్రబాబు ని, లోకేష్ ని బండ బూతులు తిట్టిస్తున్నారన్నారు. కానీ వీరందరూ రాబోయే రోజుల్లో బలి పశువులు అవ్వక తప్పదని హెచ్చరించారు. వీరందరూ మాట్లాడిన మాటలకు, గతంలో చేసిన లిక్కర్ స్కాముల, బియ్యం దోపిడీ, నీటి ప్రాజెక్టులలో అవినీతి, అక్రమాలకు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడి శిక్ష అనుభవించక తప్పదు అన్నారు. ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడిన వైసిపి నాయకులు అందరు రాజకీయ సమాధి కాక తప్పదన్నారు.జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నీనా రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరని, వైసీపీ నాయకులపై చట్టపరంగా తీవ్రమైన చర్యలు ఉంటాయని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమయమనం పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పామర్తి కిషోర్ బాబు, వకపట్ల గోపాలకృష్ణ (నాని), బత్తుల దుర్గారావు, జన్ను నాగరాజు, వాకా వెంకటేశ్వరరావు గౌడ్, సజ్జ రవి,కొర్రపాటి సురేంద్ర, మల్లెల విజయకుమార్, లీలా ప్రసాద్, కొసరాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


