ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి..
1 min read

నూతన పదవుల ప్రమాణస్వీకార మహోత్సవం రోత్సవం
నందికొట్కూరు, న్యూస్ నేడు: రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే సిద్ధంగా ఉండాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య నాయకులకు మరియు నూతనంగా పదవులు పొందిన వారికి సూచించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో మంగళవారంనియోజకవర్గ బూత్,గ్రామ, మండల,యూనిట్,క్లస్టర్, కమిటీలకు సంబంధించిన పదవులు పొందిన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగానంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య నియోజకవర్గ పార్టీ పరిశీలకులు దేవళ్ల మురళీ హాజరయ్యారు.ఈ సందర్భంగా శివానందరెడ్డి మాట్లాడుతూ మొదటినుంచి పార్టీ కోసం కష్టపడ్డ వారికీ పార్టీ పదవులు కట్టబెట్టిందని పదవులు రావడం వల్ల పార్టీపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు.మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడును మంగళవారం ఉదయం కలసి విన్నవించామని అదేవిధంగా పార్టీ పదవుల ద్వారా కార్యకర్తలను పార్టీ గౌరవిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,మండలాల కన్వీనర్లు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఖాతా రమేష్,మహేశ్వర్ రెడ్డి నాయకులు కడియం వేకటేశ్వర్లు యాదవ్,వంగాల శివరామిరెడ్డి,షకీల్ అహమ్మద్, సొసైటీ చైర్మన్ ముర్తుజావలి,కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్,సీఐలు సుబ్రహ్మణ్యం,ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


