NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్మార్ట్ మీటర్లు బిగించవద్దు…

1 min read

హొళగుంద  న్యూస్ నేడు  : సీపీఎం  రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక మండల విద్యుత్ కార్యలయం  ముందు ధర్నా చేసి అనంతరం ఆపరేటర్ కి వినతి పత్రం అందజేస్తూ ధర్నాను ఉద్దేశించి సీపీఎం మండల కారుదర్శు  వెంకటేష్ మాట్లాడుతూ   కర్నూలు జిల్లా వ్యాప్తంగా 12.24 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ సర్వీసులన్నీ త్వరలో స్మార్ట్ మీటర్ల కిందకు రాబోతున్నాయి. స్మార్ట్ మీటర్లను అందించే వెసులు బాటును  బడా పెట్టుబడుల సంస్థకు ఇచ్చింది. విడతల వారీగా జిల్లాలో స్మార్ట్ మీటర్లను అమలు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి విడతగా ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయగా రెండో విడతలో వ్యాపార సముదాయాలకు, పరిశ్రమలకు, వ్యవసాయ బోర్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించే ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకూ లక్షకు పైగా స్మార్ట్ మీటర్లను బిగించారు. ఆ తరువాత మూడో విడతగా గృహలకు ఈ॥ స్మార్ట్ మీటర్లను పెట్టనున్నారు. ప్రస్తుతానికి స్మార్ట్ మీటర్లకు పోస్ట్పెయిడ్ విధానంలోనే బిల్లులు వసూలు చేస్తున్నారు.  ఇంతబిల్లు ఎలా కట్టాలి తగ్గించాలని వినయోగదారుడు ఉస్మాన్బాష అధికారులను కోరితే తగ్గించే అవకాశం లేదని, చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఇలా ఆయనతో పాటు పలువురికి స్మార్ట్ మీటర్లు పెట్టిన తరువాత విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో స్మార్డ్ మీటరకు ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. నిత్యం వాడే సెల్ ఫోన్ లాగే స్మార్ట్ మీటర్లకు ముందుగానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రీఛార్జ్ చేసుకోవడం మరిచిపోతే కరెంట్ దానికదే కట్ అయిపోతుంది. మళ్లీ రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది. ఈ తతంగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో చేసుకోలేరనే వాదనలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ సోమవారం  విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఆ ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో  సీఐటీయూ మండల కార్యదర్శి నాగరాజు దళిత సమైక్య మండల నాయకులు మల్లేష్ రైతు నాయకులు రవి నాయలుకు హమాలీలు నాగరాజు గంగన్న ముక్కయ్య  వన్నూరుస్వామి  నగేష్ రంగన్న  తదితరులు పాల్గొన్నారు.

About Author