రాయలసీమ డిక్లరేషన్ ను తెరపైకి తెస్తాం…
1 min read

దేవాలయాలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి
లేదంటే అక్టోబరు 2న ఉద్యమానికి శ్రీకారం
అమెరికా ఐవీఎల్పీకి ఎంపికైన డా. వినూష రెడ్డికి అభినందన
రాజ్య సభ మాజీ సభ్యుడు టి.జి. వెంకటేష్
కర్నూలు, న్యూస్ నేడు: రాయలసీమ డిక్లరేషన్ ను తోనే సీమ అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతో మరోసారి తెరపైకి తీసుకొస్తామన్నారు రాజ్య సభ మాజీ సభ్యుడు టి.జి. వెంకటేష్. రాయలసీమలో సాగు,తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. సోమవారం మౌర్య ఇన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యం.. బీజేపీలోనే మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఈ నెల 11 నుంచి 31వ తేదీ వరకు అమెరికా నిర్వహిస్తున్న ఐవీఎల్పీ కార్యక్రమానికి భారతదేశం నుంచి బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి డా. వినూష రెడ్డి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. దేశ ప్రజా స్వామ్యం, రాజకీయాలు, సమాజంలో మహిళల పాత్ర తదితర అంశాలపై అమెరికాకు తెలియజేయాలని ఈ సందర్భంగా మాజీ ఎంపీ టి.జి వెంకటేష్ డా. వినూష రెడ్డికి సూచించారు.
అక్టోబరు 2నుంచి ఉద్యమానికి శ్రీకారం…
గత ప్రభుత్వంలో దేవాలయాలను విధ్వంసం చేశారని, ఇదేమని ప్రశ్నించిన వారి పై కేసులు పెట్టారని రాజ్య సభ మాజీ సభ్యుడు టి.జి. వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలని, లేదంటే అక్టోబరు 2 నుంచి ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ అధ్యక్షుడు రామస్వామి తదితరులు ఉన్నారు.

