6న నంద్యాలలో నిరుద్యోగులకు జాబ్ మేళా..
1 min read

జిల్లా ఉపాధి కల్పనా అధికారి కళ్యాణి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: రేపు ఆరవ తేదీ బుధవారం నంద్యాల జిల్లా కేంద్రంలో నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఏ కళ్యాణి తెలిపారు.నంద్యాల జిల్లా కేంద్రంలో జ్ఞానపురం మూల సాగరం రోడ్డు దగ్గర నున్న నేషనల్ ఐటిఐ కాలేజీలో రేపు ఉ 10 గంటల నుండి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.అపోలో ఫార్మసీ,రాజా బ్యాగ్స్ అనే కంపెనీల సహకారంతో రిటైల్ ట్రైనీ,అసోసియేట్,ఫార్మసిస్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలు ఉన్నాయని ఇంటర్,డిగ్రీ ఫార్మసీ ఉత్తీర్ణత ఉండాలి.18 వేల నుండి 23 వేల వేతనం ఉంటుందని 30 సం.ల లోపు వయస్సు ఉండాలి నిరుద్యోగ స్త్రీ,పురుషులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థులు మీ యొక్క వివరాలను www.ncs.gov.in లో రిజిస్టర్ నమోదు చేసుకోవచ్చని జిల్లా ఉపాధి అధికారి కళ్యాణి తెలిపారు.

