నష్టపోయిన రైతులను ఆదుకుంటాం:ఎమ్మెల్యే
1 min read

29 వరకు’రైతన్న మీకోసం’
అంగన్వాడీ కేంద్రం,పశు వైద్యశాలను తనిఖీ..
నందికొట్కూరు, న్యూస్ నేడు : భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘రైతన్న మీకోసం’కార్యక్రమాన్ని ప్రభుత్వం సోమవారం నుండి ఈనెల 29 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నుండి లబ్ధి పొందిన ప్రతి రైతు దగ్గరికి వెళ్లి ప్రభుత్వ కరపత్రాలను అందజేస్తూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించాలన్నారు. అదేవిధంగా ఉల్లి,మొక్కజొన్న లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని ప్రభుత్వ మద్దతు ధర 60 శాతం రైతులు నియోజకవర్గంలో ఉన్నారని రైతులను ఆదుకోవాలని సీఎం దృష్టికి తీసుకు వెళ్లానని ఉద్యాన పంటల ద్వారా పంటలను లాభసాటిగా తీసుకు వెళ్లేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.ముందుగా ఉదయం పట్టణంలో కోటా వీధి,కురువపేటలో ఉన్న 1వ అంగన్వాడీ కేంద్రం మరియు పశు వైద్యశాలను ఎమ్మెల్యే తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.పిల్లలు ఎంతమంది వస్తున్నారు వారికి ఏమేమి అందిస్తున్నారు పశువైద్యశాలలో రైతులకు అందుబాటులో ఉండి పశువులకు వచ్చే వ్యాధుల పట్ల పెట్టన చికిత్సలు అందించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం గిరీష్,ఎంఏఓ షేక్షావలి, ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, తహసిల్దార్ శ్రీనివాసులు, కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి,లాయర్ జాకీర్, ఎస్ఎండీ జమీల్ పాల్గొన్నారు.

