వీఆర్ఏలకు వీఆర్వో గా ప్రమోషన్లు ఇవ్వాలి
1 min read

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారాయణస్వామి
పత్తికొండ, న్యూస్ నేడు: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారాయణస్వామి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం వీఆర్ఏల వీఆర్ఏల సమస్యలపై ఆర్డీవో కార్యాలయం నందు ఆర్డీవో డాక్టర్ భరత్ నాయక్ కు డివిజన్ పరిధిలోని సిఐటియు ఆధ్వర్యంలో ఉన్న వీఆర్ఏలు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారాయణస్వామి ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారాయణస్వామి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ వ్యవస్థలో సుమారు 19,359 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నారని సుదీర్ఘకాలం నుండి చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వీఆర్ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018లో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 6,500 నుండి 10,500 కు వేతనం పెంచారు అని డీఏ 300 రూపాయలు ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం డిఏ ని కూడా ఉపసంహరించి రికవరీ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక అయినా జీతాలు పెరుగుతాయని ప్రమోషన్లు అమలు చేస్తారని వీఆర్ఏలు ఆశతో ఎదురు చూశారని కానీ గత 16 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా డ్యూటీలు వేస్తూ వారిపై పనిభారం మోపుతున్నారని ఆయన అన్నారు. గ్రామ సేవకులుగా గత ఎనిమిది సంవత్సరాల నుండి జీతాలు పెరగలేదు పోగా జీతం బెత్తడు ధరలు మోపెడు అన్న చందంగా నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న చాలీచాలని జీతాలతో వీఆర్ఏలు కాలం నెట్టుకొస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వెంటనే గ్రామ రెవెన్యూ సహాయకులకు తక్షణమే స్కేలు జీతాలు పెంచాలి .

