హెల్మెట్ వాడుకో..నీ గమ్యానికి చేరుకో
1 min read

అవగాహన కల్పించిన ఎస్సై ఓబులేష్..
న్యూస్ నేడు మిడుతూరు (నందికొట్కూరు): హెల్మెట్ వాడుకో నీవు-నీ గమ్యానికి చేరుకో అంటూ తమ సిబ్బందితో కలిసి మిడుతూరు ఎస్ఐ హెచ్ ఓబులేష్ వాహనదారులకు అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని నందికొట్కూరు-నంద్యాల జాతీయ రహదారి బ్రహ్మంగారి మఠం దగ్గర మంగళవారం సాయంత్రం ఎస్సై వాహనాల తనిఖీ చేపట్టారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వెళ్తూ ఉన్న వాహనాలను ఆపి హెల్మెట్ లేకపోవడం వల్ల కలిగే నష్టాలు అనుకోని సంఘటనల వల్ల కలిగే వాటి గురించి వాహనదారులకు ఎస్ఐ వివరిస్తూ మీకు రక్షణగా ప్రమాదాల్లో హెల్మెట్ కాపాడుతుందని వాహనదారులకు అవగాహన కల్పించారు.ద్విచక్ర వాహనాలు,ట్రాక్టర్లు,భారీ వాహనాలు చలానాలు పెండింగ్ ఉన్నచో వాటిని కట్టాలని అదేవిధంగా వాహనాలకు సరైన పత్రాలు లేని 10 వాహనాలకు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.వాహనాలకు పత్రాలు మరియు డ్రైవర్ కు తప్పనిసరిగా లైసెన్ ఉండాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది మస్తాన్ వలి,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


