నేర నియంత్రణలో రాజీ పడవద్దు ..
1 min read

నేర నియంత్రణే లక్ష్యంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలి.
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్
డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి.
డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ల పై ప్రత్యేక దృష్టి సారించాలి .
పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయాలి.
పోలీసు అధికారులతో నెల వారి నేర సమీక్షా సమావేశం .
కర్నూలు, న్యూస్ నేడు: నేర నియంత్రణలో రాజీ పడకుండా నేర నివారణే ప్రథమ లక్ష్యంగా పని చేయాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ సంధర్బంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైల తో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులతో మాట్లాడుతూ…జిల్లాలో నేర నియంత్రణను కట్టుదిట్టం చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ప్రజల ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి ప్రాధాన్యత కేసులను 7 రోజుల్లో పరిష్కరించాలన్నారు.రాత్రి గస్తీ లు , విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలన్నారు.రౌడీ షీటర్ల పై నిఘా ఉంచాలన్నారు. మొబైల్ రికవరీ, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. మార్చి 28 నుంచి క్రికెట్ బెట్టింగ్ పై నిఘా ఉంచాలన్నారు.డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయించాలన్నారు.గత నెలలో వివిధ కేసులలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గారు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ నేర సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు వెంకట్రామయ్య , ఉపేంద్రబాబు, భార్గవి , సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

