NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదోనిలోని మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి 

1 min read

పిపిపి నిదాన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి 

పత్తికొండ, న్యూస్​ నేడు:  మెడికల్ కళాశాలల నిర్వహణపై కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న పిపిపి విధానాన్ని విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి. సోమన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ పత్తికొండ మండల సమితి ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల కూడలి వద్ద  ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తే సామాన్యులు వైద్య దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ఇలాంటి చెర్లను విద్యార్థి సంఘాలన్నీ ఏకతాటిపై వ్యతిరేకించాలని కోరారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చిన కారణంగా మీరు పెట్టిన ఖర్చులో పావలా వంతు కళాశాలలకు ఖర్చు పెడితే కళాశాలలన్నీ బాగుపడి వేలాది బడుగు బలహీన విద్యార్థులకు వైద్య విద్య అందుతుందని అన్నారు.ఆదోని మెడికల్ ఈ సంవత్సరం నుండే సీట్లను కేటాయించి, ప్రభుత్వమే నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న పిపిపి విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

About Author