NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి

1 min read

పట్టణంలో ఘనంగా మహిళా దినోత్సవం..

న్యూస్ నేడు నందికొట్కూరు: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో చాముండి ఫంక్షన్ హాల్ లోఅంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను అంగన్వాడీ మరియు మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ప్రభుత్వం మహిళలను గుర్తించి వారికి అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తుందని అన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలు ఎంతగానో కృషి చేశారన్నారు.ఈ రోజుల్లో సోషల్ మీడియాలోనూ మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని అందుకే మనల్ని మనం సవరించుకుని బాధ్యతతో మెలగాల్సిన సమయం వచ్చిందని ప్రభుత్వం వచ్చాక మహిళలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టడమే కాకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరు మీదే అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. తర్వాత మహిళలను ఎమ్మెల్యే శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ మంగవల్లి,మెప్మా అధికారి శాంతకుమారి,మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,లాయర్ జాకీర్,పట్టణ మహిళా నాయకులు మీనాక్షి దేవి,డాక్టర్ వనజ మరియు తదితర మహిళలు పాల్గొన్నారు.

About Author