మహిళలు క్రీడాకారులు గా ఎదగాలి
1 min read

ప్రిన్సిపాల్డా ఇందిరా శాంతి_
అట్ట హాసంగా మాహిళ సౌత్ జోన్ 7ఏ సైడ్ ఫూట్ బాల్ పోటీలు ప్రారంభం
వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న 16 రాష్ట్ర జట్లు
న్యూస్ నేడు కర్నూల్ స్పోర్ట్స్ : మహిళలు అధిక గా క్రీడాకారులు గా ఎడగలిని ఇలాంటి ఫూట్ బాల్ క్రీడలు దోహదపడుతుంది ప్రభుత్వం డిగ్రీ కాకశాల ( పురుషుల ) ప్రిన్సిపాల్ డా ఇందిరా శాంతి అభిప్రాయం పడ్డారు, క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో సౌత్ ఇండియా ఇన్విటేషనల్ 7 ఎ సైడ్ మహిళల ఫుట్ బాల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. ఇందిరా శాంతి, జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పా రాజశేఖర్, రిడ్జ్ స్కూల్ సి. ఈ. ఓ జి. గోపినాథ్, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ సి. ఈ. ఓ పి. విజయకుమార్, ఒలింపిక్ కార్య నిర్వహకా కార్యదర్శి పి సునిల్ కుమార్, పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. టోర్నమెంట్ ప్రెసిడెంట్ శ్రీ వై. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు టీములు పాల్గొంటున్నాయన్నారు. నాలుగు వూల్స్ లో, లీగ్ కం నాకౌట్ పద్ధతిలో ఈ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జె. హేమంత్, జిల్లా బి. సి. సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ ఎ. ధర్మేంద్ర, సౌత్ జోన్ ఫ్యూట్ బాల్ పోటీల కార్య నిర్వాహక కార్యదర్శి బ్రహ్మ కుమార్, ఫిడికల్ డైరెక్టర్లు పాల్ విజయ్ కుమార్, కల్లూరు రాజశేఖర్ , శ్రీధర్ ,పలువురు ఫుట్ బాల్ క్రీడాకారులుక్రీడాభిమానులు వివిధ రాష్ట్ర కోచ్ లు మనేజర్ లు పాల్గొన్నారు పోటీల ప్రారంభం లో రాఘవేంద్ర సేవ సుమితి బాలికలు చేసిన నృత్యాలు చూపరులకు కనువిందు చేశాయి,


