ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
1 min read

మహిళామణును సత్కరించిన స్ఫూర్తి సంస్థ
ప్యాపిలి న్యూస్ నేడు: డోన్ మండలం, వెంకటనాయుని పల్లి గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్) నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం నాడు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్య, వైద్యం, సామాజిక రంగాల్లో గ్రామానికి సేవలు అందిస్తున్న 20 మంది మహిళామణులకు స్ఫూర్తి సంస్థ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించారు. మహిళల కృషి, పట్టుదల ఎందరికో స్ఫూర్తిదయకమని, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర వేలకట్టలేనిది అని స్ఫూర్తి సంస్థ అధ్యక్షుడు స్ఫూర్తి మధు అన్నారు. ఈ కార్యక్రమంకి ఆర్థిక సహకారం అందించిన వెంకటనాయునిపల్లి ప్రభుత్వ పాఠశాల టీచర్ రంగనాథ్ కు స్ఫూర్తి సభ్యులు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, స్ఫూర్తి సభ్యులు స్ఫూర్తి మధు, భాస్కర్, మోహన్ రెడ్డి, చిట్యాల మహమ్మద్, అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


