28 న నందికొట్కూర్ లో వైసీపీ ధర్నా..
1 min read

దేవనూర్,చింతలపల్లి’లో కోటి సంతకాల సేకరణ..
నందికొట్కూరు , న్యూస్ నేడు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రవేటీకరణను నిరసిస్తూ ఈనెల 28న నందికొట్కూరులో చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని నందికొట్కూరు వైసీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్,బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం డాక్టర్ సుధీర్ స్వగృహంలో మన్సూర్ మరియు,వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ జబ్బార్ ధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు, చింతలపల్లి గ్రామాల్లో మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి కోటి సంతకాలను సేకరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు తరలి రావాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణ,మార్కెట్ రాజు, రాజు,మాధురి,ఉపేంద్ర రెడ్డి,బార్గవ్,గోవిందరెడ్డి,నాగ తులసి రెడ్డి,దేవనూరు షరీఫ్, మల్లేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

