NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనాధ పిల్లలకు స్పెషల్ ఆధార్ సెంటర్  ప్రారంభం..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి అయిన జి. కబర్థి   సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి అయిన  బి. లీలా వెంకట శేషాద్రి  24-10-2025 శుక్రవారం నాడు కర్నూలు నందుగల బంగారు పేటలో ఆధార్ కార్డు లేని అనాధ పిల్లలకు ఆధార్ కార్డులు ఇప్పించడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఆధార్ సెంటర్ ను ప్రారంభించారు.   సాథి కమిటీ ద్వారా గుర్తించిన అనాధ పిల్లలకు ఈ సెంటర్ ద్వారా ఆధార్ కార్డులు ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యా వైద్యం, ప్రభుత్వం పథకాల లబ్ధి పొందుటకు  కొరకు తల్లిదండ్రులు లేని అనాధలను ఈ స్పెషల్ డ్రైవ్ లో గుర్తించారని తెలిపారు. వీరందరికీ మొదట మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారుల సహాయంతో జనన ధ్రువీకరణ పత్రాలు ఇప్పించడం జరిగిందని తర్వాత వీరికి ఈ స్పెషల్ ఆధార సెంటర్లో ఆధార్ కార్డులు ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ సర్వీసెస్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు మరియు బచ్పన్ బచావో ఆందోళన్ చైల్డ్ రైట్స్ ఎన్జీవో మౌనిక, అంగన్వాడి వర్కర్లు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

About Author