ఏలూరు కలెక్టరేట్ వద్ద వైసిపి పార్టీ అన్నదాత పోరు కార్యక్రమం
1 min read

ఎరువుల బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలి
వైయస్సార్సీపి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వర రావు, మాజీ శాసన సభ్యులు కొటారు అబ్బాయి చౌదరి,పుప్పాల వాసు బాబు,ఆధ్వర్యంలో రైతన్నకు బాసటగా అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రైతన్నకి ఎరువులు బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోసపు మాటలకు చంద్రబాబు పరిపాలన క్యారాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుకోవాలన్నారు, రైతన్నకు వైఎస్ఆర్సిపి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. దీనిలో భాగంగా ఫైర్ స్టేషన్ నందు గల వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి రైతులకు బాసటగా ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గుడిదేసి శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నుకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నేరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్, రాష్ట్ర నాయకులు దాసరి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్,రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి ఘంటా మోహన్ రావు, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయ నిర్మల, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనుపనూరి జగదీష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్ జాబ్ రిషి, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి తంగెళ్ళ రాము, నగర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జేవియర్ మాస్టర్, నగర లీగల్ సెల్ అధ్యక్షులు ప్రత్తిపాటి తంబి,రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి కిల్లారపు బుజ్జి, ఐటీ వింగ్ సెక్రటరీ ఎల్.సుభాష్ ,జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, అనిల్, బోగాది ప్రభాకర్,జిల్లా విభాగాల అధ్యక్షులు,పల్లి శ్రీను,స్టాలిన్ బాబు, పాతినవలస రాజేష్, బోగిశెట్టి పార్వతి, జిల్లా కార్యదర్శులు జనార్దన్, బుద్దాల రాము, కె. తులసి, నగర విభాగాల అధ్యక్షులు కమిటీ సభ్యులు, జిల్లా విభాగాల,రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


