గుమ్మనూరు జయరాం ను విమర్శించే స్థాయి మీకు లేదు
1 min read

ఘనంగా మంచాల సొసైటీ ఛైర్మెన్ రామకృష్ణ రెడ్డి జన్మదిన వేడుకలు
మంత్రాలయం న్యూస్ నేడు : అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ను విమర్శించే స్థాయి వైకాపా నాయకులకు లేదని టిడిపి మండల అధ్యక్షులు ఎస్ యం గోపాల్ రెడ్డి, ఎంపిటిసి సభ్యులు మేకల వెంకటేష్, అశోక్ రెడ్డి, వరదరాజు, పవన్ సూచించారు. బుధవారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో మంచాల సొసైటీ ఛైర్మెన్ రామకృష్ణ రెడ్డి జన్మదిన వేడుకలు స్థానిక టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర సర్కిల్ లో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాఘవేంద్ర స్వామి దర్శించుకునేందుకు వచ్చిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని తెలిపారు. దీనికి మంత్రాలయం వైకాపా నాయకులు గుమ్మనూరు జయరాం విమర్శించడం మీ స్థాయి కి లేదన్నారు. గత వైకాపా ప్రభుత్వం లో పాలన నచ్చక పోవడం తోనే టిడిపి లో రావడం జరిగిందన్నారు. లడ్డు కల్తీచెయ్యి తో చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేయడం మీరు కాదా అని ప్రశ్నించారు. దొంగ తనం దొంగ దొంగ అని అరిచినట్లు వైకాపా నాయకులు ఉన్నారని తెలిపారు. ఎవరినైన విమర్శించే స్థాయి చూసుకుని విమర్శలు చేయాలని సూచించారు. విమర్శలు చేయడం మాకు కూడా తెలుసు కానీ ఎవరిని విమర్శించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంచాల సొసైటీ డైరెక్టర్లు డిసి తిమ్మప్ప, చెట్నహల్లి చాపల నాగేష్, కమ్మరి నరసింహ, రఘు, శివ,డేవిడ్, శేఖర్, సిద్దు, సూగురు, మాలపల్లి నరసింహ, కల్లుదేవకుంట, చెట్నహల్లి, వగరూరు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

