బాల్య వివాహ నిర్మూలనకు వందరోజుల జాతీయ ప్రచార కార్యక్రమం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ ” జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు బాల్య వివాహ నిర్మూలనకు వందరోజుల జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జి. కబర్థి, కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి చేతుల మీదుగా బాల్య వివాహ రహిత భారత్ బ్యానర్ మరియు పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల తమ భవిష్యత్తు కాకుండా పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుందన్నారు. 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటే బాలిక ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా గర్భవతి అయితే గర్భంలోనే శిశువు మరణించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ జన్మించిన అంగవైకల్యం లేదా బుద్ధి మాంద్యంతో జన్మించే అవకాశం ఉందన్నారు. బాల్యవివాహాలు వ్యతిరేకించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహాలు చేసుకుంటే ఎన్నో నష్టాలు ఉన్నాయని వివరించారు. బాలల సహాయం కోసం విడుదల చేసిన ఈ పోస్టర్లను జిల్లాలోని ప్రతి స్కూల్ నందు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదస్సులో శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, గ్రేడ్ వన్ సూపర్వైజర్ రాజేశ్వరి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం, లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు.

