NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

1 min read

బి.గిడ్డయ్య… సిపిఐ జిల్లా కార్యదర్శి….

పత్తికొండ, న్యూస్​ నేడు : పత్తికొండ సిపిఐ చదువుల రామయ్య భవనంలో19-12-2025న విలేకరుల   సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య  మాట్లాడుతూ భారత కమ్యూనిష్టు పార్టీ సిపిఐ శతజయంతి ఉత్సవాలను ఈనెల 20 నుండి 26 వ తేదీ వరకు దేశంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గిడ్డయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సిబిఐ చదువుల రామయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా  శత వార్షికోత్సవాలు జరుగుతున్నాయని ఈ వేడుకలను జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాల్లో వాడవాడలా పండుగ వలె ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ వేడుకలను పట్టణ,మండల,గ్రామీణ ప్రాంతాల్లో వాడ వాడల్లో  పతాకావిష్కరణలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ వేడుకల్లో ప్రజలు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు అందరూ పాల్గొని శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని అన్నారు. దేశంలో పేద ప్రజలు కార్మికులు రైతులు సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు త్యాగాలు చేసిన చరిత్ర సిపిఐ కి ఉందని, దున్నేవాడికే భూమి కావాలని పేద ప్రజల కోసం భూ పోరాటాలు  నిర్వహించి లక్షలాది ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందని పేర్కొన్నారు. దేశంలో పేదల కోసం భూసంస్కరణల చట్టాన్ని పోరాడి సాధించిందని, అలాగే బ్యాంకుల జాతీయగీకరణ కోసం పోరాటాలు చేసి విజయం సాధించిందని తెలిపారు.

About Author