NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాఠశాల విద్యార్థులకు బ్లడ్ గ్రూపు పరీక్షలను నిర్వహించిన ఎన్​ఎస్​​ఎస్​ యూనిట్​

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జాతీయ సేవాపథక స్పెషల్ క్యాంపులో భాగంగా మూడవరోజు పి. రుద్రవరం, నూతన పల్లె గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డి తెలిపారు. పి. రుద్రవరం గ్రామంలో ఎన్​ఎస్​ఎస్​ వాలంటీర్లు మద్యపానం, ధూమపానం, గుట్కా వంటి వ్యసనాల పర్యవసానాలు, సైబర్ నేరాలపట్ల అవగాహన, రహదారి నియమాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ లపట్ల గ్రామీణులకు అవగాహన కలిగించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు సామాజిక బాధ్యతతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంపట్ల గ్రామస్తులు హర్షం ప్రకటించారు. నూతనపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు బ్లడ్ గ్రూపు పరీక్షలను నిర్వహించి తెలిపారు. గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ మీద అవగాహన కలిగించారు. పిల్లల్లో పోషకాహారలోపం, మహిళలు పిల్లల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడంపట్ల స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘువీర హర్షంవ్యక్తంచేశారు. ఈ సందర్భంగా రక్తపరీక్షలు నిర్వహించిన టెక్నీషియన్ రంగాచారి, హెడ్ మాస్టర్ రఘువీరలను ప్రోగ్రాం ఆఫీసర్లతోపాటు NSS సమన్వయకర్త డాక్టర్ పి. నాగరాజు సత్కరించారు.

About Author