2 కోట్ల 84 లక్షల నిధులు విడుదల..
1 min read

మహానంది, న్యూస్ నేడు: అన్నదాత సుఖీభవ_ పీఎం కిసాన్ 2 వ విడత మహానంది మండలానికి సంబంధించి రెండు కోట్ల 24 లక్షల రూపాయలు విడుదల అయినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. మండల అధ్యక్షురాలు యశస్విని ఆధ్వర్యంలో మహాందిలోని ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ నందు అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధులు విడుదల పై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహానంది మండలంలోని వివిధ గ్రామాల నుండి 4,200 మంది రైతులు లబ్ది పొందనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 5, 000 కేంద్రం 2,000 రైతుల ఖాతాల్లోజమచేయడంజరిగిందన్నారు. దాదాపు 500 మంది కౌలు రైతులు మహానంది మండలంలో ఉన్నారని వారికి ప్రస్తుతం ఈ నిధులు వర్తించవని, ప్రభుత్వం ప్రత్యేకంగా వారికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా కౌలు రైతులకు స్వతహాగా ఒక్క సెంటు భూమి కూడా ఉండకుండా ఉండాలని అలాంటి వారు మాత్రమే కౌలు రైతులుగా గుర్తింపు పొందుతారని గుర్తింపు కార్డులు వారికి మాత్రమే జారీ చేసే అవకాశం ఉందన్నారు. దాదాపు 80 శాతం మంది రైతులు తమ పొలాలను కౌలుకు తీసుకున్న వారికి ఎలాంటి పట్టాదారు పాసుపుస్తకం, వారి యొక్క ఆధార్ కార్డు వివరాలు, కౌలుకు తీసుకున్నట్లు రాతపూర్వకంగా రాయించి ఇవ్వకపోవడం వల్ల కౌలుకు తీసుకున్న వ్యక్తులు కౌలు గుర్తింపు కార్డులను పొందలేకపోయారని అందువల్ల వారు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగానష్టపోతున్నారన్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే కౌలు రైతులుగా గుర్తింపు కార్డులు పొంది ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ రమాదేవి, టిడిపి నాయకులు మసీదుపురం గ్రామానికి చెందిన మౌలీశ్వర రెడ్డి, గాజులపల్లెకు చెందిన మహేశ్వర్ రెడ్డి, గాజుల పల్లెకు చెందిన శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు రఘునాథ శర్మ, మండల టిడిపి అధ్యక్షుడు కంచర్ల శివ, తిమ్మాపురం గ్రామానికి చెందిన ఉల్లి మధు, గాజులపల్లి ఆర్ఎస్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు జనసేన నాయకులు మా రెడ్డి రామయ్య, మా రెడ్డి సుబ్రమణ్యం వివిధ గ్రామాలకు చెందిన టిడిపి జనసేన, బిజెపి కూటమి నాయకులు పాల్గొన్నారు.

