NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతుల పట్ల సీఎం ప్రత్యేక శ్రద్ధ:ఎమ్మెల్యే

1 min read

నందికొట్కూర్ లో అన్నదాత సుఖీభవ..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  రైతుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో బుధవారం సాయంత్రం అన్నదాత-సుఖీభవ 2వ విడత నిధులు విడుదల కార్యక్రమం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసినఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనేదే ప్రభుత్వం ఉద్దేశమని రాయలసీమకు ముఖద్వారం అయిన నందికొట్కూరు నుండి రాయలసీమకు నీళ్లను ఇచ్చిన ఘనత ఇక్కడ దక్కిందని మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.తుఫాన్ వల్ల నష్టపోయిన పంటల వివరాలను మళ్లీ రీ సర్వే చేసి పంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని వాటి వివరాలను ఆర్ఎస్ కే సిబ్బంది వివరాలను త్వరగా ఇవ్వాలని అన్నారు.ప్రతి హామీని నెరవేర్చే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని అన్నారు.నియోజకవర్గంలో 36,734 మంది రైతులకు గాను 24 కోట్ల 94 లక్షల సంబంధించిన చెక్కును విడుదల చేశారు.ఈకార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో డి నాగజ్యోతి,జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, ఏడిఏ గిరీష్,ఏఓలు షేక్షావలి, పీరు నాయక్,కృష్ణారెడ్డి నియోజకవర్గ పరిశీలకులు దేవళ్ల మురళీ,మండల కన్వీనర్లు,అధికారులు నాయకులు పాల్గొన్నారు.

About Author