కష్టపడ్డ సర్పంచ్ లకు అవమానమా..?
1 min read

సర్పంచ్ లను కనీసం సన్మానించే గౌరవం లేదా..
అవసరం ఉన్నప్పుడే వారి సేవలా..?
నందికొట్కూరు న్యూస్ నేడు: గత ఐదేళ్లుగా గ్రామాల అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడ్డారు అప్పులు చేశారు తిండి లేకపోయినా గ్రామ ప్రజలే నా దేవుళ్ళు అనే ధ్యేయంగా సర్పంచులు ముందుకెళ్లారు.గ్రామంలో ఏమి జరగాలన్నా కూడా సర్పంచుల సహకారంతోనే జరిగేది.గ్రామాల్లో త్రాగునీటి సరఫరా,డ్రైనేజీ,గ్రామ పరిశుభ్రత తదితర వాటిపై సర్పంచులు ఎంతగానో కష్టపడ్డారు.గ్రామానికి ఏ చిన్న సమస్య వచ్చినా మరియు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అధికారులు సర్పంచులను సంప్రదించి వాటిని పూర్తి చేయించేవారు.
అవసరం ఉన్నప్పుడే సర్పంచ్ ల సేవలా..?
అవసరం ఉన్నప్పుడే అధికారులు సర్పంచులను వినియోగించుకుంటున్నారా.. 2021లో సర్పంచులుగా ఎన్నికయ్యారు.కానీ ఈనెల ఏప్రిల్ రెండవ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగిసింది.ఐదేళ్లపాటు గ్రామంలో అది చేయ్యాలి ఇది చేయాలని అధికారులు మమ్మల్ని వెంబడించేవారు గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేశాం ఎంతగానో కష్టపడ్డాం మా పదవి ముగిశాక మా సేవలకు గుర్తింపుగా కనీసం శాలువా పూలదండతో సత్కరించి సేవలను గుర్తించే బాధ్యత అధికారులకు లేదా అంటూ నందికొట్కూరు,మిడుతూరు మండలాల్లో ఉన్న కొందరు సర్పంచులు బాహాటంగా అధికారులపై మండిపడుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో 13 పంచాయతీలు మిడుతూరు మండలంలో 19 పంచాయతీలు ఉన్నాయి.ఈ మండల పరిషత్ కార్యాలయాల్లో సర్పంచుల గౌరవానికి సత్కారమే లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి సేవలకు గుర్తుగా సర్పంచుల సేవలను గుర్తుకు తెచ్చుకొని సర్పంచులను సన్మానించాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


