NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

5 లక్షల 35 వేల సీఎంఆర్ఎఫ్ పంపిణీ

1 min read

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు

 నందికొట్కూరు, న్యూస్​ నేడు: ముఖ్యమంత్రి సహాయనిధి5,35,046 రూ.ల చెక్కులను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం పంపిణీ చేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన మురళీకృష్ణకు-4 లక్షలు,కేశవ-75 వేలు,కుమారి-45,046 మరియు పాములపాడు మండలం భానుముక్కల గ్రామానికి చెందిన గడ్డం జీవన్-15 వేల రూ.ల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఉదయంఅల్లూరు రోడ్డులో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సంద‌ర్భంగా వారి విగ్రహానికి ఎమ్మెల్యే మరియు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, నందికొట్కూరు జనసేన ఇన్చార్జి నల్లమల రవికుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తర్వాత నందికొట్కూరు తహసిల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ లో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసులు,మండల వ్యవసాయ అధికారి షేక్షావలి, మల్లికార్జున రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author