NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తూతూ మంత్రంగా వైసీపీ కోటి సంతకాల కార్యక్రమం

1 min read

రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్

కర్నూలు, న్యూస్​ నేడు:  వైసీపీ నాయకులు చేస్తున్న కోటి సంతకాల కార్యక్రమం ఓ కొత్త నాటకమని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ విమర్శించారు. కర్నూల్ అసెంబ్లీ కార్యాలయంలో ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక… వైసీపీ నాయకులు మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు అని చెబుతూ వారంతకు వారే దొంగ సంతకాలు చేసుకుని ప్రజలు చేసినట్లుగా షో చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేస్తే… మా అధినేత  నారా చంద్రబాబు నాయుడు  మళ్లీ గాడిన పెడుతున్నారని అన్నారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటోందని అన్నారు.“వైసీపీ కోటి సంతకాల సేకరణ చేయాల్సింది పీపీపీ విధానంపై కాదు. 2024 ఎన్నికల్లో ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు దింపేశారో దానిపై కోటి సంతకాలు సేకరించాలి. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు చేశారో దానికి కోటి సంతకాలు సేకరించాలి. వైసీపీ నాయకులను ఎందుకు చిత్తుచిత్తుగా ఓడించారో దానికి కోటి సంతకాలు సేకరించాలి” అని వ్యాఖ్యానించారు.

About Author