అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన మహనీయుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, కర్నూలు తరపున పి.వి. కిషోర్ రెడ్డి, పర్యావరణ ఇంజనీర్, ప్రాంతీయ కార్యాలయం, కర్నూలు, జి. నరసింహులు, శాస్త్రీయ అధికారి, జోనల్ కార్యాలయం కర్నూలు మరియు సిబ్బంది ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నాము. డిసెంబర్ 15, 1952న ఆయన మరణం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసిన చారిత్రక పరిణామాలకు నాంది పలికింది. ఈ సందర్భంగా, తెలుగు ప్రజలంతా ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగు భాషా ప్రయోజనాలకు కృషి చేయాలని విజ్ఞప్తి చేసారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు చేసిన కృషి చిరస్మరణీయమైనది. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బోర్డు అధికారులు, సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించారు.

