పట్టణ సీఐకి ఉత్తమ అవార్డు
1 min read

మున్సిపాలిటీ మేనేజర్,ఏఈ కి అవార్డులు
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణ సీఐ వై ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఉత్తమ అవార్డును అందుకున్నారు.అదేవిధంగా నందికొట్కూరు పురపాలక శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న మున్సిపాలిటీ మేనేజర్ సుహ్రులత మరియు అసిస్టెంట్ ఇంజనీర్ బి.దినేష్ కుమార్ లు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మరియు ఎస్పీ సునీల్ షెరాన్,జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఉత్తమ ప్రశంసా పత్రాలను అందజేశారు.అదేవిధంగా పగడ్యాల పంచాయతీరాజ్ ఏఈ ఎస్ జావీద్ అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా ప్రశంశా పత్రాలు అందుకున్న వీరికి వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.


