NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు రేంజ్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

1 min read

జండా వందనం చేసిన ఐజి జీవిజి అశోక్ కుమార్

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు :79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు రేంజ్ ఏలూరు ఐజి జివిజి అశోక్ కుమార్ ఐపీఎస్ వారు ఏలూరు రేంజ్ కార్యాలయంలో శుక్రవారం జండా వందనములు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియ చేసి, స్వాతంత్రం ద్వారా సంక్రమించినటువంటి హక్కులను పరిరక్షిస్తూ, ఇప్పటివరకు పోలీసు సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలను అందించినట్లు అదే స్ఫూర్తితో మెరుగైన సేవలు అందించడం కొరకు సమాజంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్  యొక్క క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ  మరియు ఏలూరు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి ఐఏఎస్ వారితో కలిసి జండా వందన కార్యక్రమాన్ని నిర్వహించి సిబ్బందికి మిఠాయిలను అంద చేసినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్రం కొరకు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి స్వాతంత్ర్య ఫలాలను అందించారన్నారు.

About Author