NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

79వ స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్న ఎస్డిపిఐ

1 min read

హొళగుంద న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఆలూరు తాలూక హొళగుంద మండల పార్టీ కార్యాలయం లో  ఎస్డిపిఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్ మరియు ఉపాధ్యక్షులు కె.సలాం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 79వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం కార్యదర్శి ఎం.హఫీజ్ మాట్లాడుతూ  మన దేశంలో అనేక మతాలవారు వారి వారి సంప్రదాయబద్ధంగా వారి వారి పండుగలు జరుపుకుంటారు కానీ మనదేశంలో అందరూ కలిసికట్టుగా కులమతాలకు అతీతంగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, జరుపుకుంటారు. ఎలాగైతే ఫాసిస్టు పాలనను అరికట్టేందుకు ఆంగ్లేయులను మన పూర్వీకులు తరిమికొట్టారో     అదేవిధంగా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల కోసం, దేశ శ్రేయస్సు కోసం, ప్రాణ త్యాగాలు చేయడానికి ఎస్ డి పి ఐ పార్టీ కార్యకర్తలు ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ డి పి ఆలూరు అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author