NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పది”లో ప్రతిభ కనబరిస్తే..ఎమ్మెల్యే పదివేల హామీ

1 min read

మార్కెట్ యార్డ్,గురుకుల పాఠశాలలో జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  వచ్చే ఏడాది మార్చిలో జరిగే పరీక్షల్లో 565 మార్కులకు పైగా వచ్చిన ప్రతి విద్యార్థికీ ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఇస్తానని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య విద్యార్థులకు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగిన 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు అన్ని విధాలుగా గురుకులాల్లో మంచి విద్య,నాణ్యమైన భోజనం అందిస్తున్నామని క్రమశిక్షణతో మంచిగా చదువుకోవాలని ఈ రోజున మీ చిరునవ్వులు చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానని అన్నారు తర్వాత విద్యార్థులకు బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు. ముందుగా ఉదయం నందికొట్కూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారుఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,ప్రిన్సిపాల్ వెంకటరమణమ్మ,ఎంపీడీవో సుమిత్రమ్మ,తహసిల్దార్ శ్రీనివాసులు,సొసైటీ చైర్మన్ దామోదర్ రెడ్డి,పలుచాని మహేశ్వర్ రెడ్డి, లక్ష్మాపురం భూషి గౌడ్,రమణ, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author