NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రోమోర్ సెంటర్ ద్వారా రైతులకు 9 టన్నుల యూరియా పంపిణీ

1 min read

మండల వ్యవసాయ అధికారి కే శ్రీదేవి

చెన్నూరు, న్యూస్ నేడు: చెన్నూరు గ్రోమోర్ సెంటర్ ద్వారా  9 టన్నుల యూరియా( 200 బస్తాలు) ను రైతులకు బుధవారం మండల వ్యవసాయ అధికారి కే. శ్రీదేవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం చెన్నూరు విలేకరులతో మాట్లాడుతూ, గ్రోమోర్ సెంటర్ ద్వారా రైతులకు 9టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. యూరియా పంపిణీ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని ఆమె  అన్నారు. ఈ సందర్భంగా ఆమె గ్రోమోర్ మేనేజర్ ఆనంద్ ద్వారా కుర్చీలు, త్రాగునీరు వంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రోమోర్ సెంటర్ నందు రైతులు ఎలాంటి ఆందోళనలు చెందకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రైతులందరూ కూడా క్రమ పద్ధతిలో కూర్చొని తమకు కావాల్సిన ఎరువులను తీసుకోవడం జరిగిందని వ్యవసాయ అధికారి తెలిపారు. ఎక్కడ కూడా యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీగా రైతులకు అందించడం జరుగుతుందని అదేవిధంగా రైతులందరూ కూడా సమన్వయం పాటించి మీకు అవసరమైనటువంటి ఎరువులను తీసుకెళ్లాలని ఆమె రైతులకు సూచించడం జరిగింది. రైతులు ఎకరాకు 100 కేజీల యూరియాను మూడు దఫాలుగా వాడుకోవాలని అంతకంటే ఎక్కువ వాడడం ద్వారా చీడపీడలు ఎక్కువ అవ్వడమే కాకుండా రైతులకు సాగు ఖర్చులు కూడా  పెరగడం జరుగుతుందని ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలని ఆమె కోరారు.

About Author