కర్నూల్ జెడ్పీ చైర్మన్ పదవి కురువలకు కేటాయించాలి
1 min read
కర్నూలు జిల్లా కురువ సంఘం డిమాండ్.
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లాలో అత్యధిక శాతం జనాభా కలిగిన కులం మాది.మా కులంలో చాలామంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి జెండాలు మోసి,ప్రస్తుతం జిల్లాలో అత్యధిక జడ్పిటిసి మరియు ఎంపిటిసిల గెలుపునకు కృషి చేసిన కులజులను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అలాగే విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు తదితర శాసనసభ్యులు అందరు కూడా కురువ కులాన్ని గుర్తించి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పదవి కురువలకు కేటాయించాలని కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు,అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే. రంగస్వామి, ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు,పెద్దపాడు ధనుంజయులు కోశాధికారి కే. సి.నాగన్న,నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు తిరుపాల్ తదితరులు విజ్ఞప్తి చేస్తున్నాము.


