NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి వాల్మీకులకే కేటాయించాలి!

1 min read

గోతులదొడ్డి ఉలిగయ్యకు అవకాశం కల్పించాలి – ఏపీ వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ డిమాండ్

హోళగుంద న్యూస్ నేడు: రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన వాల్మీకి బోయ సామాజిక వర్గానికి ఈసారి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాల్మీకి బోయ సామాజిక వర్గానికి రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉన్న గోతులదొడ్డి ఉలిగయ్యకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని కేటాయించి సముచిత గుర్తింపు ఇవ్వాలని కోరారు.గతంలో వాల్మీకి సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం, జిల్లా స్థాయి కూటమి నాయకులు నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రాతిపదికన, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వాల్మీకులకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కేలా కృషి చేయాలని ఎల్లార్తి అర్జున్ పత్రికా ప్రకటన ద్వారా కోరారు.వాల్మీకి బోయ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా కూటమి నాయకత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *