నూతన ఎస్. ఈ గా బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్ కుమార్
1 min read

పుష్పగుచ్చాలతో స్వాగతం పలికిన యూనియన్ నాయకులు
కర్నూలు, న్యూస్ నేడు:కర్నూలు విద్యుత్ ఎస్.ఈ.గా రెడ్డి పోగు ప్రదీప్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. అధికారులు, కార్మికులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం బహుజన యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమణ మూర్తి, సెక్రటరి, పి. సుభాకర్, కంపెనీ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మున్వుర్ బాష, దేవ కుమార్, మల్లి కార్జున తదితరులు నూతన ఎస్ ఈ. ప్రదీప్ కుమార్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.


