ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష..కార్యదర్శులకు సన్మానం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆర్టీసి ఉద్యోగుల నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వీ. జవహర్లాల్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .సి. కాశన్న ల ను ఎన్ఎంయు ఆధ్వర్యంలో కలెక్టర్ కాంప్లెక్స్ లోని జిల్లా అధ్యక్షులు కార్యాలయంలో శాలువాతో పూలమాలతో సత్కరించడం జరిగినది.ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఏపిజేఏసి దృష్టికి తేవడం జరిగినది. అయితే జిల్లా అధ్యక్షులు ఈ జవహర్లాల్ స్పందిస్తూ రాష్ట్ర జేఏసీ చైర్మన్ కామ్రేడ్ విద్యాసాగర్ ఆదేశాల మేరకు త్వరలో నూతన జేఏసి ఏర్పాటు చేస్తున్నాము అందులో మీరు కూడా ప్రధాన భాగస్వామ్యం ఉంటుంది. కనుక అన్ని సమస్యలపై సానుకూలంగా చర్చించి పరిష్కారం. దిశంగా ముందుకు పోదాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిలేటి, రాష్ట్ర కార్యదర్శి గౌస్, జిల్లా కార్యదర్శి ఇస్మాయిల్, జిల్లా చైర్మన్ రవీంద్రబాబు, డిపో 1,2, కార్యదర్శిలు ఇషాక్, ఫక్రుదీన్ జిల్లా ఈ. సి మెంబర్, శ్రీనివాస్,ప్రభుత్వ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, మరియు ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి నాగకిషోర్, నగర అసోసియేటె అధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

