NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 ‘ ఎమర్జెన్సీ ’లో ప్రాథమిక చికిత్స కే ప్రాధాన్యం

1 min read

బ్రెయిన్​ అండ్​ స్పైయిన్​ హాస్పిటల్​  సీనియర్​  కన్సల్టెంట్​ అండ్​ క్రిటికల్​ కేర్​ డా. వి. మురళీ కృష్ణ

కర్నూలు హాస్పిటల్​ , న్యూస్​ నేడు:ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంటలో ఇచ్చే ప్రాథమిక చికిత్సే ప్రాణం నిలబెడుతుందని,  ఆ సమయంలో బాధిత వ్యక్తికి సహాయం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు బ్రెయిన్​ అండ్​ స్పైయిన్​ హాస్పిటల్​  సీనియర్​  కన్సల్టెంట్​ అండ్​ క్రిటికల్​ కేర్​ డా. వి. మురళీ కృష్ణ. ఆదివారం  కర్నూలు నగరం ఏ క్యాంపులోని హార్ట్​ ఫౌండేషన్​ ఛాంబరులో ఫౌండేషన్​ ప్రధాన కార్యదర్శి, డా. ఎన్టీ ఆర్​ హెల్త్​ యూనివర్శిటీ వైస్​ ఛాన్సలర్​  డా. చంద్ర శేఖర్​ నేతృత్వంలో ‘ ఎమర్జెన్సీ సమయంలో సాధారణ చికిత్స ’పై  మెడికల్​ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రెయిన్​ అండ్​ స్పైయిన్​ హాస్పిటల్​ క్రిటికల్​ కేర్​ వైద్యులు డా. మురళీ కృష్ణ  మాట్లాడారు. రోడ్డు ప్రమాదం జరిగినా… పాము కాటు వేసినా… ఇంటిలో ప్రమాదవ శాత్తు గ్యాస్​ పేలినా , విషం తాగినా,  తదితర సమయల్లో  ఇచ్చే అత్యవసర చికిత్స అతి ముఖ్యమైనదన్నారు.  ప్రస్తుత సమాజంలో యువత అతివేగంగా వాహనాలు నడుపుతూ.. ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్​ విద్యార్థులు, ప్రజలు, యువత …  ఎవరైనా ఎమర్జెన్సీ లో  ప్రాథమిక చికిత్స ఇవ్వడంపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా బ్రెయిన్​ అండ్​ స్పైయిన్​ హాస్పిటల్​  సీనియర్​  కన్సల్టెంట్​ అండ్​ క్రిటికల్​ కేర్​ డా. వి. మురళీ కృష్ణ స్పష్టం చేశారు.

డా. మురళీ కృష్ణ కు ఘన సన్మానం

కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ లో మెడికల్​ విద్యార్థులకు ‘ ఎమర్జెన్సీసమయంలో ప్రాథమిక చికిత్స ’ పై అవగాహన కల్పించిన  బ్రెయిన్​ అండ్​ స్పైయిన్​ హాస్పిటల్​  సీనియర్​  కన్సల్టెంట్​ అండ్​ క్రిటికల్​ కేర్​ డా. వి. మురళీ కృష్ణ ను ఫౌండేషన్​ గౌరవాధ్యక్షుడు చంద్ర శేఖర్​ కల్కూర, ప్రధాన కార్యదర్శి డా. చంద్ర శేఖర్​ ఘనంగా సన్మానించారు. అనంతరం డా. ఎన్టీ ఆర్​ హెల్త్​ యూనివర్శిటీ రిజిష్ట్రార్​ గా బాధ్యతలు స్వీకరించిన  డా. సాయి సుధీర్​ ను కూడా ఘనంగా సత్కరించారు.

About Author