NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు.. ప్రతి చిన్నారికి విద్య అందించడమే లక్ష్యం!

1 min read

లింగదహాళి గ్రామంలో ఎంవీఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీజనల్ హాస్టల్ ప్రారంభం

ప్రారంభించిన హోళగుంద మండల ఎంఈఓ-2 పి. కబీర్ సాబ్

హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హోళగుంద మండల పరిధిలోని లింగదహాళి గ్రామంలో ఎంవీఎఫ్ (MVF) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీజనల్ హాస్టల్‌ను హోళగుంద మండల విద్యాశాఖాధికారి-2 పి. కబీర్ సాబ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వలస కార్మిక కుటుంబాలకు చెందిన పిల్లలు తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లడం వల్ల చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. అలాంటి చిన్నారుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వారు నిరంతరం చదువును కొనసాగించేందుకు సీజనల్ హాస్టళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందాలన్నదే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. పిల్లలు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.వలస కార్మిక కుటుంబాల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ఎంవీఎఫ్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.వలసల కారణంగా ఏ ఒక్క చిన్నారి కూడా చదువుకు దూరం కాకూడదు.. ప్రతి బిడ్డకు విద్య అందాలి.. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలి అనే ఆశయంతో సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేయడం గ్రామీణ విద్యాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *