NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యతోనే ఉజ్వల భవిష్యత్…

1 min read

కార్పొరేట్ కు ధీటుగా.. ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతాం…

రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్

కర్నూలు టౌన్ మోడల్ స్కూల్ లో మెగా పేరెంట్స్ టీచర్స్ ‘ఆత్మీయ సమ్మేళనం’  

కర్నూలు,  న్యూస్ నేడు : విద్య భవిష్యత్తును నిర్ణయిస్తుందని  రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్  తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమ్మేళనం 2.0 సందర్భంగా కర్నూలు టౌన్ మోడల్ హైస్కూల్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో  మంత్రి ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి  టి.జి.భరత్ మాట్లాడుతూ విద్య మన భవిష్యత్తుని నిర్ణయిస్తుందని, విద్యార్థులు ఈ విషయంపై శ్రద్ధ వహించి తమ భవిష్యత్తును తీర్చుదిద్దుకునే కోవాలని కోరారు.  తల్లిదండ్రులు కూడా విద్యార్థులను వారికి ఇష్టమైన విద్యను అభ్యసించే విధంగా ప్రోత్సహించాలని వారికి ఇష్టం లేని విషయం లో బలవంతంగా  వ్యవహరించరాదని తెలిపారు.

త్వరలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని అందులో భాగంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారని తెలిపారు. విద్యార్థులకు మంచి పోషకాహారం ఉండాలన్న ఉద్దేశంతో సన్నబియ్యం సరఫరా చేయిస్తున్నారని,  స్కూల్ యూనిఫార్మ్స్ ,బ్యాగులు, పుస్తకాలు , షూస్ మొదలగునవి నాణ్యమైన ఉత్పత్తులను ఎంచుకొని అందిస్తున్నారని తెలిపారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఇదే స్కూల్లో  తల్లికి వందనం కార్యక్రమం కింద 97% తల్లుల ఖాతాల్లో నగదు విజయవంతంగా జమ చేయడం జరిగిందని, మిగిలిన 3% సమస్యలు ఆధార్, ఖాతా సంబంధిత లోపాల వలన తలెత్తాయని, వాటినీ త్వరలో పరిష్కరిస్తామన్నారు ఈ సొమ్ము తల్లిదండ్రులు విద్యార్థుల కొరకే ఖర్చు చేయాలని వేరే విధంగా వాడుకో రాదని తల్లిదండ్రులను కోరారు.  సమావేశానికి కార్పొరేటర్ మౌనిక రెడ్డి ఎంఈఓ లు సునీత , ఓంకార్ యాదవ్, హెడ్మాస్టర్ ప్రసాద్, విద్యా కమిటీ సభ్యులు  మరియు తల్లి తండ్రులు పాల్గొన్నారు.

  నేను చదివింది ఇక్కడే..

అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల  ప్రిన్సిపల్ పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన పేరెంట్ టీచర్స్ మెగా ఆత్మీయ సమ్మేళనం 2.0 లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఇదే కాలేజీలో నేను మా సోదరి ఇంటర్మీడియట్ పూర్తి చేశామని తెలియజేశారు. ఇష్టపడి చదివే విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారని ఈ సందర్భంగా మంత్రి టిజి భరత్ ఆకాంక్షించారు.

షైనింగ్ స్టార్స్ కు  అభినందన

ఈ సందర్భంగా ఎంపీసీ విభాగంలో 986 మార్కులు సాధించి ఆంధ్ర రాష్ట్రంలో టాపర్ గా నిలిచిన పావని ని, షైనింగ్ స్టార్స్ గా గుర్తించిన వారిని మరియు టైక్వాండో క్రీడల లో మెడల్ లు సాధించిన వారిని మంత్రి  అభినందించి సన్మానించారు. తొలుత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సమావేశంలో ప్రిన్సిపల్ పద్మావతి లెక్చరర్ రెహమాన్, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

కళాశాలలో సమస్యలన్నీ పరిష్కరిస్తా… మంత్రి

ఈ సందర్భంగా విద్యార్థులు తమ కళాశాల కు త్రాగునీటి కొరకు మినరల్ వాటర్ ప్లాంట్ ను , గ్రౌండ్ లెవెలింగ్ చేయించాలని మరియు ఇతర సమస్యలను వివరించగా మంత్రి టిజి భరత్ సమాధానమిస్తూ… కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కర్నూలు పాఠశాలలకు అవసరమైన పనుల నిమిత్తం ఏడు కోట్ల రూపాయల ఖర్చు ఉంటుందని అంచనాకు రావడం జరిగిందని కావున ఆ సమస్యలు తీర్చే చర్యలు చేపడతామని తెలిపారు.

About Author