అనుమతులు లేని కోచింగ్ సెంటర్లు, ఫీజుల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి
1 min read
– DYFI డిమాండ్
కర్నూలు, న్యూస్ నేడు: జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రత్యక్షం అవుతూ ఆఫీస్ లేకుండా కనీసం వసతులు లేకుండా మాకు కోచింగ్ సెంటర్లో అంటూ గొప్పలు చెప్పుకుంటూ యువకులను విద్యార్థులను మోసం చేస్తున్న కోచింగ్ సెంటర్ నంద్యాల పట్టణంలో ఎలాంటి అధికారిక అనుమతులు, ఆఫీసులు లేకుండా కేవలం సోషల్ మీడియా ప్రచారంతో గ్రౌండ్లలో కోచింగ్ నడుపుతున్న అనధికార కేంద్రాలపై మరియు సైనిక్, నవోదయ స్కూల్స్ ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేల రూపాయలు వసూలు చేస్తున్న అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డివైఎఫ్ఐ (డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ మాట్లాడుతూ.. నంద్యాలలో చాలా కోచింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రైవేట్ కోచింగ్ పేరిట అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్న సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో మూల సాగరం డివైఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.అభినందనలతో డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీ.


