పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
1 min read
మున్సిపల్ ఇంజినీర్లకు చైర్మన్ శ్రీరామ్ చినబాబు సూచన
మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లె పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ చైర్మన్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు అధికారులకు సూచించారు.మంగళవారం మదనపల్లె మున్సి పల్ కార్యాలయం లో ఇంజినీర్లతో నిర్వహించిన సమావేశంలో మునిసిపల్ చైర్మన్ పాల్గొని పట్టణంలో జరుగు తున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వ హణ, ప్రజలకు అందు తున్న మున్సిపల్ సేవలపై సమీక్ష నిర్వహించారు. అలాగే ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఇంజినీర్ల కు సూచించారు. పట్టణ ప్రజల అవస రాలకు అనుగుణం గా మదనపల్లె సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలి పారు. అనంతరం 28వ వార్డు కౌన్సిలర్, విశ్వ బ్రాహ్మణ కార్పొ రేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామ కృష్ణ, మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబును దుశ్శాలువతో ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారంలో చైర్మన్ శ్రీరామ్ చినబాబు పారద ర్శకంగా ప్రాధాన్యత కు పెద్దపీట వేస్తారని పేర్కొ న్నారు. ఈ కార్య క్రమంలో టీడీపీ అన్నమయ్య జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, 15వ వార్డు కౌన్సిలర్ ఎస్.ఎల్.వి. రఘు, ఏఎంసీ మార్కెట్ డైరెక్టర్ సుబ్ర హ్మణ్యం, బండి అమర, తెలుగు యువత నాయ కులు కొత్తపేట శ్యామ్, ముద్దుకృష్ణ మనాయుడు, ఉమేష్ బోనాల, గగన్, సాయి, శివ, ఐటీడీపీ రాజేష్ లు పాల్గొన్నారు.



