NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమాజంలో ఐక్యత కొనసాగాలి

1 min read

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

  • సంతెకూడ్లురు లో ఇఫ్తార్​ విందు

 ఆదోని, న్యూస్​ నేడు : ఆదోని మండలం సంతకూడ్లురు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ రామోజీ రాగప్ప  నివాసంలో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంపాపతి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ మాసం పవిత్రతను గుర్తుచేసుకున్నారు. అనంతరం ముస్లిం పెద్దలు మౌలా, గౌస్, డిష్ మౌలా, దివాన్ వలి, అబ్దుల్ రజాక్, షేకు, నబి, ఆశం తదితరులను మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో సౌహార్ద్రం, ఐక్యత కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  గుడిసె శ్రీరాములు , బజారప్ప , కల్లుబావి మల్లికార్జున,  రాఘవరెడ్డి , విజయ్ చంద్ర,  భారత్ ,  స్థానిక నాయకులుపార్టీ కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

About Author