NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాల మారన్న మృతికి కారణమైన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి  

1 min read

మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గుడిసె మహానంది

హొశగుంద న్యూస్ నేడు:  హోళగుంద మండల కేంద్రంలో స్థానిక గెస్ట్ హౌస్ నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు జి మహానంది మాట్లాడుతూ హొళగుంద మండల పరిధిలో లింగంపల్లి గ్రామంలో ఈనెల 22వ తేదీన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మరణించిన మాల మారెన్న కుటుంబాన్ని రోడ్డుపాలు చేసిన విద్యుత్  సంబంధిత అధికారులపై సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే మారన్న మృతదేహాన్ని అంత్యక్రియలు జరిపి వస్తుండగా ఎస్సీ కాలనీలో ఉన్న మెయిన్ లైన్ వైర్ కింద కిందపడి అక్కడే ఉన్న పోలీస్ అధికారులు అప్రమత్తం చేసి ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి ఏ ఒక్క ప్రాణానిష్టం జరగకుండా కాపాడినారని వారు అన్నారు ఇలాంటి సంఘటన జిల్లాలోని చాలాచోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని  అన్నారు మారెన్న  కుటుంబానికి 50 లక్ష రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని అదేవిధంగా విద్యుత్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూల్ ఎస్సీ ఆఫీస్ ముందు ఈనెల 26వ తేదీన ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు యువజన సంఘం జిల్లా కన్వీనర్ భరత్, పెద్దహ్యట వీరభద్ర, లింగంపల్లి మల్లికార్జున, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

About Author