కర్నూలు జిల్లా టిడిపి పార్టీ నూతన అధ్యక్షురాలుగా గుడిశె కృష్ణమ్మ బాధ్యతలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులునారా చంద్రబాబునాయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి శ్రీమతి గుడిసె కృష్ణమ్మ పేరును ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు పేరు ను ప్రకటించినందున ఇప్పటివరకు జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న పాలకుర్తి తిక్క రెడ్డి వారికి ఈరోజు తేదీ 24-12-2025 న పాలకుర్తి తిక్కా రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం కర్నూల్ నందు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలను అప్పగించడం జరిగినది. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షురాలుగా మించబడిన శ్రీమతి గుడిశె కృష్ణమ్మ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన శ్రీ పూల నాగరాజు ఈ రోజు బాధ్యతలను స్వీకరించడం జరిగినది. కార్యక్రమమునకు కర్నూల్ పార్లమెంట్ సభ్యులుబస్తిపాటి నాగరాజు మాజీ శాసనసభ్యులు శ్రీ కే మీనాక్షి నాయుడు మాజీమంత్రివర్యులు శ్రీ కె. ఈ ప్రభాకర్ కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలు జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ శ్రీ వై నాగేశ్వరరావు యాదవ్ పార్టీ నాయకులు శ్రీ కె వి సుబ్బారెడ్డి మరియు పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమమునకు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా తిక్కా రెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలను నారా చంద్రబాబునాయుడు 15.4.2024 తేదీన అప్పగించగా వారి ఆదేశానుసారము రాష్ట్ర పార్టీ నిర్దేశించిన మేరకు కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అలాగే జిల్లాలో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించడంలోనూ అలాగే పార్లమెంటు అభ్యర్థిని గెలిపించడంలోనూ శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగిందని 1999 తర్వాత జిల్లాలో అత్యధిక స్థానాలను గెలిపించడంలో పార్టీ ఆదేశాల మేరకు పనిచేశానని ప్రస్తుతము అధ్యక్ష పదవి మార్పు జరిగినందున కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి గుడిసె కృష్ణమ్మ కి ఇవ్వడం జరిగిందని ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు ని నియమించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ బీసీలు మహిళలకు ప్రాధాన్యతనివ్వడం తెలుగుదేశం పార్టీకి కొత్తేమీ కాదని, ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఇద్దరు మహిళలకు ప్రాధాన్యత కల్పించారని. అందుకు చంద్రబాబు నాయుడు కి లోకేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఇది ఒక శుభ పరిణామం అని అన్నారు .తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పక్షపాతి అని మరోసారి రుజువైందని ఈ నియామకములను బట్టి రుజువైందని తెలిపారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని ఈ ఎన్నికల్లో కూడా పార్టీని విజయపథం వైపు నడిపించేందుకు కృషి చేయాలని అలాగే జిల్లాలోని నాయకులందరి సమన్వయంతో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు సూచన చేశారు.


