NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇన్నోవేషన్ ల్యాబును త్వరలోనే ఏర్పాటు చేస్తాం… వీసి

1 min read

కర్నూలు , న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీలో పరిశోధనలను, స్టార్టప్లను ప్రోత్సహించడంలో భాగంగా ఇన్నోవేషన్ ల్యాబును త్వరలోనే ఏర్పాటు చేస్తామని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు తెలిపారు. వర్సిటీ బోటనీ విభాగం ఆధ్వర్యంలో సెనేట్ హాలులో నిర్వహిస్తున్న “కెరీర్ ఆపర్ట్యునిటీస్ అండ్ రిసోర్సెస్ ఇన్ ప్లాంట్ సైన్సెస్” జాతీయ సదస్సు రెండవరోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో ఆంధ్రదేశం అన్నపూర్ణగా ఖ్యాతిని సొంతంచేసుకుందని, అలాంటి దేశంలో ఆహార భద్రత – ఆహార ధాన్యాల సరఫరాలను సమన్వయం చేసుకోవడంపై దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. వృక్షశాస్త్ర ప్రాధాన్యత కేవలం ఇంతవరకే పరిమితంకాకుండా వైద్యశాస్త్రానికి కూడా విస్తరించిందన్నారు.వ్వవసాయరంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికనుగురించి తెలియజేశారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండే యంత్రాలు, యాప్‌లగురించి తెలియజేశారు.  అందుబాటులోఉన్న  వివరించారు. బోటనీ, మైక్రోబయాలజీ విద్యర్థులకు ఈ రంగం ఎంతోబాగా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం జరిగిన ముగింపు సమావేశానికి సదస్సు కన్వీనర్, బోటనీ విభాగాధిపతి ఆచార్య ఆర్. భరత్ కుమార్ అధ్యక్షత వహించారు. రెండురోజుల సదస్సు విజయవంతంగా పూర్తవడంపట్ల ఆయన హర్షం వ్యక్తంచేసారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వక్తలను వర్సిటీ అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథ రెడ్డి, ఆచార్య సి.వి.కృష్ణారెడ్డి, బోటనీ విభాగ అధ్యాపకులు డాక్టర్ బి. కవిత, డాక్టర్ కె. వెంకటరత్నంతోపాటు లైఫ్‌సైన్స్ విభాగాలతోపాటు వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author