NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హెల్త్ యూనివర్సిటీ స్టేట్ క్రికెట్ టీం కు కే ఎం సి విద్యార్థి ఎంపిక

1 min read

అభినందించిన ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ..

కర్నూలు, న్యూస్​ నేడు: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్టేట్ క్రికెట్ టీంకు కర్నూల్ మెడికల్ కాలేజీ క్రికెట్ టీం నుంచి టీం కెప్టెన్ ఇంటర్న్ గోకుల్ వెంకట సాయినాథ్ ఎంపిక కావడం పట్ల అడిషనల్ డిఎమ్ఇ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ వైద్య విద్యార్ధి  సాయినాథ్ ను అభినందించడం జరిగింది. స్టేట్ టీంకు రాష్ట్రస్థాయిలో వివిధ వేడుకలు కళాశాల నుండి 120 మంది రావడం జరిగింది. ఆల్ ఇండియా సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ పోటీలు త్వరలో మైసూర్ యందు జరుగుతున్న సందర్భంగా స్టేట్ టీం ను ఎంపిక చేయడం జరిగింది. నార్త్, ఈస్ట్, వెస్ట్ సౌత్, సెంట్రల్ జోన్ టీంలు మైసూర్ లో జరిగే పోటీల్లో పాల్గొననున్నాయి.  ఫిజికల్ డైరెక్టర్ రామకృష్ణ ను ప్రిన్సిపల్ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిందియా శుభప్రద పాల్గొన్నారు.

About Author