NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కస్తూర్బా’లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

1 min read

కేజీబీవీ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి..

న్యూస్ నేడు మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6 వ తరగతి మరియు ఇంటర్ ప్రథమ సంవత్సరం (ఎంపీసీ గ్రూప్)లో చేరుటకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సోమవారం అన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈనెల 12 వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరిస్తామని విద్యార్థులు https://apkgbv.apcfss.in   లో ఆన్ లైన్ చేసిన తర్వాత ఆన్లైన్ పేపర్ ఆ పాఠశాలలో అందజేయాలని అన్నారు. ఆరవ తరగతిలో-40 సీట్లు మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో-40 సీట్లు ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. మధ్యలో మానివేసిన పిల్లలు, తల్లిదండ్రులు లేని వారికి  మరియు తల్లి కానీ తండ్రి కానీ లేని విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ అన్నారు.ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని అన్నారు.

About Author