ఏ ఐ లో భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టడమే లక్ష్యం
1 min read

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో కేంద్ర మంత్రి
వివిధ ఇంజనీరింగ్ కోర్సులు అభ్యర్థిస్తున్న విద్యార్థుల కోసం
ఏఐ అప్లికేషన్లు అభివృద్ధి
ఏలూరు ఎంపీ పూట్టా మహేష్ కుమార్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: విద్యలో ఏఐ మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ప్రోత్సహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ యొక్క మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద “కృత్రిమ మేధస్సుపై సామర్థ్య నిర్మాణ కార్యక్రమం”) చేపట్టినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుమ్దార్ వెల్లడించారు. విద్యలో ఏఐ నైపుణ్యాలను అభివృద్ది చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సోమవారం కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఏఐ -ఆధారిత బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి, AIలో పరిశోధనలను ప్రోత్సహించడంలో అధ్యాపకులు మరియు విద్యావేత్తల సామర్థ్యాలను బలోపేతం చేయడానికి CBAI కార్యక్రమం రూపొందించబడిందని కేంద్రం మంత్రి తెలిపారు. భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం (NEP)కి అనుగుణంగా విద్యార్ధులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజైన్ థింకింగ్, హోలిస్టిక్ హెల్త్, ఆర్గానిక్ లివింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్, గ్లోబల్ సిటిజన్‌షిప్ ఎడ్యుకేషన్ (GCED) వంటి ముఖ్యమైన నైపుణ్యాలను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం రూ. 990.00 కోట్ల వ్యయంతో మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoEs)ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

