NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీపీఎస్సీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి

1 min read

డిఆర్వో వెంకట నారాయణమ్మ

కర్నూలు,  న్యూస్​ నేడు : ఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు ఏపీపీఎస్సీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని డిఆర్వో వెంకట నారాయణమ్మ అధికారులకు సూచించారు.శనివారం కలెక్టరేట్ లో ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో డిఆర్వో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్వో  మాట్లాడుతూఈ నెల 9 నుంచి 11 వ తేదీ వరకు ఏపీపీఎస్సీ కి సంబంధించి ఏపీ ఫారెస్ట్ సబ్-ఆర్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (మెయిన్స్), థానేదార్, ఏపీ ఎండో మెంట్స్ సబ్-ఆర్డినేట్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–II  వ్రాత పరీక్షలను ఆఫ్‌లైన్ విధానం / OMR ఆధారిత (ఆబ్జెక్టివ్ టైప్) రూపంలో  నిర్వహించనున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో 7 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. మొత్తం 9,958 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు.సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా బ్యాకప్, తాగునీటి సౌకర్యం, కూర్చునే ఏర్పాట్లు, అలాగే APPSC మార్గదర్శకాలను కఠినంగా పాటించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని  డిఆర్వో ఆదేశించారు.ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు . ఉదయం 8.00 నుండి 8.45 గంటల వరకు, అదనంగా 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో 9.00 గంటల వరకు, మధ్యాహ్నం 1.00 నుండి 1.45 గంటల వరకు, అదనంగా 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో 2.00 గంటల వరకు జరుగుతాయని, గ్రేస్ పీరియడ్ ముగిసిన తరువాత ఎవరినీ అనుమతించరని తెలిపారు. పూర్తి పరీక్ష సమయం ముగిసే వరకు ఎవరూ పరీక్ష హాలును విడిచిపెట్టరాదని తెలిపారు.అదనంగా, పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం  కలెక్టరేట్, కర్నూలులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (ల్యాండ్‌లైన్ నెం. 08518-277305) కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని డిఆర్వో తెలిపారు. సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివరాముడు, కల్లూరు, కర్నూలు రూరల్ మరియు కర్నూలు అర్బన్ మండలాల తహసీల్దార్లు, పోలీస్,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author