పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరం
1 min read

ఎంఈవో లు ఫైజున్నిసా బేగం,మల్లికార్జున నాయక్..
మిడుతూరు , న్యూస్ నేడు: పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని మిడుతూరు మండల విద్యాశాఖ అధికారులు ఎం ఫైజున్నిసా బేగం మరియు బి మల్లికార్జున నాయక్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారంప్రధానోపాధ్యాయులకు మరియు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈవోలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2020 జాతీయ విద్యా విధానం కార్యక్రమంలో భాగంగా విద్యాంజలి 2.0 అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కడుమూరు స్పెషల్ స్కూల్ పాఠశాల హెచ్ఎం రామేశ్వర రెడ్డి హాజరై వారికి అవగాహన కల్పించారు.దాతలు, మేధావులు,విద్యావంతుల సహకారంతో పాఠశాలలనుఅభివృద్ధి చేయాలని పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అదేవిధంగా విద్యార్థులకు కావలసిన స్టడీ మెటీరియల్ వంటి వాటిని ఏ విధంగా సమకూర్చుకోవాలని వాటి గురించి అవగాహన కల్పించారు.పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు దాతలతో మమేకమై వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మిడుతూరు హెచ్ఎం సాయి తిమ్మయ్య,మండలంలోని హెచ్ఎం లు,ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.

