వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఎన్జీటి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ) నిర్దేశాల ప్రకారం వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ లో వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ ప్రక్రియల అంశాల పై కలెక్టర్ కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మున్సిపల్ కమిషనర్ లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, గూడూరు మున్సిపాలిటీ లలో రోజుకు ఎన్ని మెట్రిక్ టన్నులు వ్యర్థాలు సేకరించారు, సేకరించిన వ్యర్థాలలో ఎన్ని టన్నులు తడి, పొడి చెత్త ఉంది అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. తడి చెత్తను విండ్రో కంపోస్టింగ్ పద్ధతి ద్వారా వ్యవసాయ ఎరువుగా మార్చాలన్నారు. పొడి చెత్తలోని ప్లాస్టిక్, గాజు, మరియు పేపర్ వంటి వస్తువులను వేరు చేసి రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్ యార్డ్ లలో పేరుకుపోయి ఉన్న వ్యర్థాలను క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఫ్యామిలీ యూనిఫైడ్ సర్వే లో పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు. సమావేశంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగి రెడ్డి, ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

